కరోనా వైరస్ లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...
వైరస్ లక్షణాలు..
దీని లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయి. ఒక్కో సమయంలో మీకు వ్యాధి తీవ్రత ఎలా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండడమే కాకుండా మరి కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.
* జలుబు
*తలనొప్పి
* దగ్గు
* మోకాలి నొప్పులు
* జ్వరం
* పూర్తిగా అనారోగ్యం
కరొనా వైరస్ గురించి..
కరొనా వైరస్ అనేది కొన్ని వైరస్‌ల సమూహం అని చెప్పొచ్చు. దీని గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే.. కొన్ని కరొనా వైరస్‌లు జంతువులకు మాత్రమే వ్యాపిస్తాయి.. కానీ, ఇందులోనే కొన్ని వైరస్‌లు మానవులను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది వ్యాపించిందంటే చాలు.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇదే ప్రభావం తీవ్రమైతే న్యూమోనియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. అనేక ఇందులో ప్రాణాంతక అనేక క్రిములు ఉన్నాయి.
ఎలా వ్యాపిస్తుందంటే..
కరొనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది.
* ఇది దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.
* శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
* వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.. అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.
* మలం ద్వారా తక్కువనే చెప్పాలి.ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది..
కరొనా వైరస్‌లు శరీరంలో ప్రవేశించిన అనంతరం అనేక తీవ్ర లక్షణాలను చూపుతుంది. ఇది కొన్ని సార్లు మిగతా సమస్యలకు కూడా కారణం అవుతుంది. న్యూమోనియా వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.
దీంతో పాటు.. కఫంతో కూడిన దగ్గు ఉంటుంది..
ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది.
ఛాతీ దగ్గర నొప్పిగా ఉంటుంది.
గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.
కరొనా వైరస్‌ని ఎలా గుర్తించాలి..
ఈ వైరస్‌ని గుర్తించడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు..
శారీరక పరీక్ష ద్వారా..
రక్త పరీక్ష ద్వారా ఈ వైరస్‌ని గుర్తించొచ్చు.
కఫం, గొంతు శుభ్రపరుచు, ఇతర శ్వాస పరీక్షల ద్వారా వీటి ఆధారంగా వైరస్‌ని గుర్తించొచ్చు..చికిత్స విధానం ఏంటి..?
కరొనా వైరస్ సోకిందని అనుమానంగా ఉంటే ముందుగా వైద్యుల దగ్గరికి వెళ్లాలి.. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు.
* ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
* నీరు ఎక్కువగా తాగుతుండాలి.వైరస్‌ని నివారించవచ్చా..
మానవులలో ప్రవేశించిన కరొనా వైరస్‌కి ట్రీట్‌మెంట్‌కి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, ఇది వ్యాప్తి చెందకుండా మాత్రం నిరోధించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించొచ్చు. అందుకోసం ఇలా చేయండి.
* ఎప్పటికప్పుడూ చేతులను సబ్బునీటితో కడగాలి.
* చేతలను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు..
* అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
* మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి..ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబందిత సమాచారం కోరకు కింది ఇవ్వబడ్డ గూగుల్ లింక్ ని క్లిక్ చెయ్యండి...
No comments:
Post a Comment