గ్యాంగ్ లీడర్‌గా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా?
అదేంటి.. గ్యాంగ్ లీడర్ చిరంజీవి కాకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తన హవా చూపిస్తున్నాడు. వచ్చిన ప్రతి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తున్నాడు. అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గ్యాంగ్ లీడర్. ఈయన కెరీర్లో ఇది చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఉన్న చాలా రికార్డులను గ్యాంగ్ లీడర్ తిరగరాసింది. తెలుగు ఇండస్ట్రీలో మన కంటే మాస్ హీరో ఎవరూ లేరు అని మెగాస్టార్ మరోసారి గ్యాంగ్ లీడర్ సినిమాతో నిరూపించాడు. అలాంటి సినిమా విడుదలై నేటికి 30 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా గ్యాంగ్ లీడర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. గ్యాంగ్ లీడర్ సినిమాకి ముందు కూడా చిరంజీవి ప్రతి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం అలవాటుగా మార్చుకున్నాడు.
అంతకు ముందు చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘యముడికి మొగుడు’, ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’, ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’ వంటి సినిమాలతో ఘన విజయాలను అందుకున్నారు. ఇక 1990లో ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ చిత్రం మే 9న విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా విడుదలైన సరిగా సంవత్సరానికి 1991 మే 9న ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై రికార్డ్స్ బ్రేక్ చేసింది. గ్యాంగ్ లీడర్ 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. గ్యాంగ్ లీడర్ సినిమాకి ముందు కూడా చిరంజీవి ప్రతి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం అలవాటుగా మార్చుకున్నాడు. అంతకు ముందు చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘యముడికి మొగుడు’, ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’, ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’ వంటి సినిమాలతో ఘన విజయాలను అందుకున్నారు. ఇక 1990లో ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ చిత్రం మే 9న విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఆ సినిమా విడుదలైన సరిగా సంవత్సరానికి 1991 మే 9న ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై రికార్డ్స్ బ్రేక్ చేసింది. గ్యాంగ్ లీడర్ 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. గ్యాంగ్ లీడర్ సినిమా వెనక అసలు కథ మరొకటి ఉంది. ఈ సినిమా కథ రాసుకున్నది ముందు చిరంజీవి కోసం కాదు. ఆయన తమ్ముడు నాగబాబు కోసం. అతడిని దృష్టిలో పెట్టుకొని గ్యాంగ్ లీడర్ కథ సిద్ధం చేశారు పరుచూరి బ్రదర్స్. అయితే అది అనుకోని విధంగా చిరంజీవి చేతుల్లోకి వచ్చింది. అప్పటి వరకు హీరోగా రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు నాగబాబు. అలాంటి సమయంలో ఈ గ్యాంగ్ లీడర్ కథ ఆయన కోసం సిద్ధం చేశారు. టైటిల్ కూడా అరె ఓ సాంబ అనుకున్నారు. అయితే ఈ కథ విన్న తర్వాత తన కంటే అన్నయ్య చిరంజీవికి బాగా సెట్ అవుతుందని నాగబాబు స్వయంగా చెప్పడంతో.. మళ్లీ కథలో కొన్ని మార్పులు చేసి మెగాస్టార్ తో చేశారు
Don movie published on YouTube
12-5-2021
No comments:
Post a Comment