విశాఖలోనే విశాఖకు గిఫ్ట్ ఇవ్వనున్న జగన్ ?
సాధారణంగా ఏపీ కేబినెట్ సమావేశాలు అమరావతిలో నిర్వహిస్తుంటారు. కానీ ఈ సారి రొటీన్‌కు భిన్నంగా కేబినెట్ సమావేశాన్ని విశాఖలో నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి... విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కావొచ్చని కుండబద్ధలు కొట్టారు. ఇందుకు ఊతమిచ్చే విధంగా దీనిపై ఏర్పాటైన బీఎన్ రావు కమిటీ సైతం విశాఖను ఏపీకి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేయాలని తమ నివేదికలో సూచించింది. కమిటీ నివేదికలోని కీలకమైన అంశాలపై ఈ నెల 27న జరగబోయే కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సైతం తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన మరోసారి ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఈ నెల 27న జరగబోయే కేబినెట్ సమావేశం అనంతరం విశాఖను ఏపీకి పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు... ఈ ప్రకటన ద్వారా విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్న సీఎం జగన్... ఇందుకోసం విశాఖలోనే ఈ నెల 27న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.
విశాఖ ప్రతీకాత్మక చిత్రం(Image/ Facebook)
సాధారణంగా ఏపీ కేబినెట్ సమావేశాలు అమరావతిలో నిర్వహిస్తుంటారు. కానీ ఈ సారి రొటీన్‌కు భిన్నంగా కేబినెట్ సమావేశాన్ని విశాఖలో నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సూత్రప్రాయంగా తెలిపారు. అంటే... విశాఖలోనే విశాఖను ఏపీ పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటించబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
No comments:
Post a Comment