విశాఖలోనే ఈనెల 27 ఏపీ కేబినెట్ భేటీ
వేదిక నిర్ధారణ కాగానే కేబినెట్ భేటీపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జగన్ విశాఖలో నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఏపీకి మూడు రాజధానులు అని అధికారీకంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశం విశాఖలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమరావతిలో రైతుల ఆందోళనలు నేపథ్యంలో విశాఖలో కేబినెట్ నిర్వహించాలని సీఎం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కడప పర్యటనలో ఉండగా సీఎస్ సహాని కి జగన్ ఏర్పాట్ల విషయమై సూచనలు చేసినట్లు సమాచారం. కలెక్టర్ వినయ్ చంద్ కి చీఫ్ సెక్రెటరీ నీలం సహాని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ కౌన్సిల్ హాల్ లేదా, కలెక్టరేట్, లేక మరో వేదిక కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. వేదిక నిర్ధారణ కాగానే కేబినెట్ భేటీపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇవాళ లేదా రేపు దీనిపై ఓ అధికారిక ప్రకటన విడుదల కానుంది.
అయితే మరోవైపు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాత్రం రాజధాని విషయంలో జగన్‌పై విమర్శలు దాడి చేస్తున్నారు. అమరావతిలో అడుగు బెట్టడానికి ధైర్యం లేకనే.. జగన్ రాజధానిని విశాఖకు తరలిస్తున్నారంటున్నారు. అయితే జగన్ విశాఖలో నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఏపీకి మూడు రాజధానులు అని అధికారీకంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే విశాఖ ప్రజలకు విశాఖలోనే గిఫ్ట్ ఇచ్చిన వారవుతారు జగన్. ఎన్నో సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజల్లో తాము వెనుకబడి ఉన్నామన్న భావన ఉంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజలకు సంతోషం కలిగించే అంశం. విశాఖలో రాజధాని ఏర్పాటు అయితే భీమిలి రాజధాని కేంద్రంగా ఉండొచ్చు అని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
No comments:
Post a Comment