Chandrababu Naiduకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు.. జగన్‌కు జై!
విశాఖపట్నంలో సమావేశమైన టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్ణయంపై చర్చ.. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం. త్వరలోనే చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించాలని నిర్ణయం.
Also Read: మూడు రాజధానుల ప్రకటన.. ఉపరాష్ట్రపతి వెంకయ్య సంచలన వ్యాఖ్యలుఈ సమావేశం తర్వాత మాట్లాడిన గంటా శ్రీనివాసరావు.. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం సంతోషం కలిగించే విషయమే అన్నారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని.. మున్సిపల్ ఎన్నికల కోసమే ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే ఆలోచన చేశారని వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో ప్రశాంత నగరంలో అరాచక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని.. దీనిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టాలన్నారు. మెట్రో, రోడ్లు వేస్తే విశాఖపట్నం విశ్వనగరం కాదని.. మాస్టర్ ప్లాన్, ట్రాఫిక్, హౌసింగ్ లాంటి అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
విశాఖకు చెందిన టీడీపీ నేతలు కూడా ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు జైకొట్టడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు చంద్రబాబు అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తెలిపితే.. విశాఖ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్థించడం ఆసక్తికరంగా మారింది. మరి నేతల తీర్మానంపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
No comments:
Post a Comment