తెలంగాణలో మరో ఘోరం.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం
కాలేజీలో ల్యాబ్ ఇంచార్జిగా పని చేస్తున్న వ్యక్తి.. తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం వంటి కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో మరో ఘోరం జరిగింది. హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌లో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. పేట్ బషీరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో ల్యాబ్ ఇంచార్జిగా పని చేస్తున్న వెంకటేష్.. తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. కాలేజీ ల్యాబ్‌లోనే తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment